చంద్రయాన్ 3 ప్రయోగంలో మనవారి భాగస్వామ్యం
Continues below advertisement
ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-3... నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రాజెక్టులో మన తెలుగువారి భాగస్వామ్యం కూడా ఉంది. కూకట్ పల్లిలోని ప్రశాంత్ నగర్ లోని నాగసాయి ప్రెసిషన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.... చంద్రయాన్-3 కోసం వినియోగించిన కొన్ని స్పేర్ పార్ట్స్ తయారు చేసింది. రోవర్, ల్యాండర్, ప్రొపల్షన్ మాడ్యుల్స్‌లో బ్యాటరీలు ఏర్పాటు చేసుకునే విడి భాగాలను కూకట్‌పల్లిలోనే తయారు చేశారు. కంపెనీ యజమాని డీఎన్ రెడ్డి.... 1998 నుంచి ఇస్రో ప్రయోగించిన 50 శాటిలైట్లలో పలు విడి భాగాలు అందిస్తూ వచ్చారు.
Continues below advertisement