MLC Kavitha Started From Delhi Airport | కొడుకు చేతిలో చేయ్యెసి... సంతోషంగా బయలుదేరిన కవిత | ABP

MLC Kavitha Started From Delhi Airport | ఈడీ అధికారులతో దిల్లీ వెళ్లిన కవిత...నేడు కొడుకు చేతులు పట్టుకుని ఎంతో సంతోషంగా అదే దిల్లీ నుంచి బయలుదేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరికొన్ని గంటల్లో హైదరాబాద్ గడ్డపై అడుగుపెట్టనున్నారు. సుమారు 5 నెలల పాటు జైలులో ఉన్న ఆమె నిన్న బెయిల్ పై విడుదలయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం దిల్లీ ఎయిర్ పోర్టులో ఫ్లైట్ ఎక్కి...సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్ చేరుకోనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నవి దిల్లీ ఎయిర్ పోర్టులోని విజువల్స్. కొడుకు చేతు పట్టుకుని ఎంతో ఆనందంగా కవిత అడుగులు వేస్తున్నారు. పక్కనే భర్త, సోదరుడు కేటీఆర్ కూడా ఉన్నారు. ఎన్నాళ్లైందో కవితను ఇంత సంతోషంగా చూసి అంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పటికే శంషాబాద్ ఎయిర్ పోర్టుకి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ స్థాయిలో చేరుకున్నారు. కవితకు ఘన స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola