ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపి మరీ ఆ దేశంలో చిక్కుకుపోయిన మన విద్యార్థులను తిరిగి ప్రాణాలతో భారత్ తీసుకువచ్చినందకు మోదీని తిడుతున్నారా అంటూ నిప్పులు చెరిగారు బండి సంజయ్. కొవిడ్ సమయంలో 200 కోట్ల వ్యాక్సిన్లను ఉచితంగా పంపిణీ చేసి పేదోళ్ల ప్రాణాలను కాపాడిన దేవుడు నరేంద్రమోదీ అంటూ బండి సంజయ్ కొనియాడారు.