Ashok Nagar Protest High Tension: నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటూ ఆవేదన, ఆగ్రహం

హైదరాబాద్ అశోక్ నగర్ లో నిన్న రాత్రి కలకలం రేగింది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రవల్లిక అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రూప్-2 పరీక్షలు మళ్లీ వాయిదా పడటంతో హాస్టల్ లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు అక్కడ్నుంచి మృతదేహాన్ని తరలించే ప్రయత్నం చేయగా.... అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న అభ్యర్థులు, యువత అడ్డుకున్నారు. పరీక్ష వాయిదా పడటంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola