చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్
అల్లు అర్జున్ రాత్రంతా చంచల్ గూడ జైల్లోనే ఉండడంతో ఆయన అభిమానులంతా జైలు ముందే వీరంగం చేసిన సంగతి తెలిసిందే. ఓ అభిమాని మాత్రం అత్యుత్సాహంతో జైలు గేటులోపలికి వెళ్లాడు. అల్లు అర్జున్ ను ఎందుకు అరెస్టు చేశారంటూ వీరంగం చేశాడు. దీంతో పోలీసులు అతణ్ని కొట్టి.. అక్కడి నుంచి బలవంతంగా పంపేశారు.
సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయిన కేసులో అరెస్టైన అల్లు అర్జున్ విడుదల అయ్యారు. భద్రతా కారణాల రీత్యా చంచల్ గూడ జైలు ప్రధాన ద్వారం నుంచి కాకుండా వెనుక మరో గేటు నుంచి అల్లు అర్జున్ ను బయటకు పంపారు. ఆయనకు ఎస్కార్ట్ ఇచ్చి మరీ పోలీసులు పంపించారు. డిసెంబర్ 13న అల్లు అర్జు్న్ ఈ కేసులో అరైస్టైన సంగతి తెలిసిందే. సాయంత్రానికి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినా కూడా అప్పటికే నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు ఆయన్ను తరలించేశారు. దీంతో నేడు ఉదయం 6.30 ప్రాంతంలో అల్లు అర్జున్ ను విడుదల చేశారు.