Allegations on Marredpally CI : నేనూ సిఐ బాధితుడ్నే అంటున్న టీజీ వెంకటేష్ !| ABP Desam

అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మారేపడ్ పల్లి సీఐ నాగేశ్వరరావు అంశంలో మరిన్ని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బంజారాహిల్స్ భూ కబ్జాకేసులో తనను ఆ సీఐనే అన్యాయంగా ఇరికించాడంటూ మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మీడియా ముందుకు వచ్చారు. తనపైనా తప్పుడు కేసులు పెట్టాడని భూ కబ్జా కేసులో A3 గా ఉన్న సుభాష్ పొలిశెట్టి ఆరోపిస్తున్నారు. సీఐ నాగేశ్వరరావును అరెస్ట్ చేయాలంటూ ఎల్బీ నగర్ డీసీపీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. లేని పక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేస్తామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola