Rajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం

Actor Rajendra Prasad Daughter Dies: సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) కూతురు గాయత్రి (38) చనిపోయారు. ఆమె వయసు 38. కార్డియాక్ అరెస్ట్ తో గాయత్రి చనిపోయినట్లుగా చెబుతున్నారు. గాయత్రికి ఒక కూతురు ఉన్నారు. మహానటి సినిమాలో చిన్ననాటి సావిత్రి పాత్రను గాయత్రి కూతురు పోషించింది. ఛాతీలో నొప్పి (Chest Pain) ఉందని నిన్న ఏఐజీ ఆసుపత్రిలో (AIG Hospital) ఆమెను చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు. రాజేంద్రప్రసాద్‌కు ఒక కుమారుడు కుమార్తె. గాయత్రి భర్త మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. గాయత్రి న్యూట్రిషియన్ గా సలహాలు ఇస్తున్నట్లుగా సమాచారం. ఈమె అంత్యక్రియలు రేపు జరిగే అవకాశం ఉంది. రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) ను పరామర్శించేందుకు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం క్రిష్ణారావుతో పాటు సినీ ప్రముఖులు కూడా వెళ్తున్నారు.                             

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola