15 Years For Mecca Masjid Blast: ఇప్పటికీ కొనసాగుతున్న భద్రతా చర్యలు | ABP Desam
సరిగ్గా మక్కామసీదులో బాంబు పేలి నేటికీ 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా 58 మంది గాయపడ్డారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసినా... వారిపై నేరారోపణలు రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది. దీంతో ఐదుగురు నిందితులపై కేసు కొట్టివేశారు. కానీ అప్పటినుంచి అలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా భద్రతా బలగాలను కట్టదిట్టం చేశారు.