FTL దాటిన హుస్సేన్ సాగర్ .. దిగువ ప్రాంతాల్లో హై అలెర్ట్
తెలంగాణ వ్యాప్తంగా వరదలు ముంచెత్తుతున్నాయి. వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవటంతో తూములు ఓపెన్ చేసి నీటిని మూసీ నదిలోకి వదిలిపెడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా డేంజర్ బెల్స్ మోగిస్తున్న వరదలపై గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణలో రెండు, మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు ప్రాణ నష్టం కూడా భారీగానే సంభవించింది. తాజాగా కురిసిన వర్షాలు, వరద ప్రవాహం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా 16 మంది చనిపోయారని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సోమవారం ఉదయం సమయంలో సూర్యాపేటలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలతో కలిసి జిల్లాలో వర్షాలు, వరద నష్టంపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. అంతే కాకుండా ఖమ్మం జిల్లాలో పర్యటించి, వరద ప్రభావిత ప్రాంతాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు వెళ్లి స్వయంగా పరిశీలించారు రేవంత్.