Home Minister Amit Shah on Naxalism | 2026 నాటికి దేశాన్ని నక్సల్ రహితంగా మారుస్తాం
నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో అమిత్ షా మాట్లాడుతూ 2026 నాటికి దేశాన్ని నక్సల్ రహితంగా మారుస్తామని ప్రకటించారు. నక్సలైట్లు లొంగిపోతే పునరావాసం కల్పిస్తామని, లేదంటే చర్యలు తప్పవని అమిత్ షా హెచ్చరించారు. వచ్చే ఎన్నికలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం తెలంగాణ బీజేపీ ఎంపీలు తమతో ఎంతగానో గొడవపడ్డారని అన్నారు అమిత్ షా.
తెలంగాణలో పసుపు బోర్డు ఆఫీసును ప్రారంభించారు కేంద్ర మంత్రి అమిత్ షా... ఈ పసుపు బోర్డు కోసం తెలంగాణ బీజేపీ ఎంపీలు చాలా గొడవపడ్డారని... పసుపు రైతుల 40 ఏళ్ల కలను నిజం చేసిన వ్యక్తి ప్రధాని మోడీ అని అన్నారు.
2023 ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చామని ... ఇలా తమపై నమ్మకం ఉంచితే మరెన్నో చేస్తామని ప్రజలకు హామీ అమిత్ షా. ప్రధాని మోదీ హామీ ఇచ్చారు అంటే అది ఎప్పటికైనా జరుగుతుందని గుర్తు పెట్టుకోవాలని ప్రజలను కోరారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు అమిత్ షా.