Himayat Sagar Reservoir Gates Open | భారీ వర్షానికి హిమాయత్ సాగర్ గేట్లు ఓపెన్
హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ గేట్లు ఓపెన్ చేసారు అధికారులు. అర్ధరాత్రి హిమాయత్ సాగర్ నుంచి నీటిని మూసీ నదిలోకి విడుదల చేసారు. సాయంత్రం హైదరాబాద్ నగరంలో కురిసిన కుండపోత వర్షానికి హిమాయత్ సాగర్ కు భారీగా వరదనీరు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలోనే గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేశారు అధికారులు. నీటి విడుదల చేసిన నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. హైదరాబాద్‌లో కురిసిన కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలను సూచిస్తున్నారు అధికారులు.
మరో రెండు రోజులు వర్షాలు ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు అలర్ట్‌లు ఇస్తూ నేరుగా పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించింది. అవసర అయితే తప్ప ప్రజలకు బయటకు రావద్దని కూడా విజ్ఞప్తి చేశారు. అధికారులు అంతా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ, హైడ్రా, పోలీస్, ట్రాఫిక్ విభాగాలు కలిసి పని చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.