Hema Arrest Bengaluru Rave Party Case | సినీ నటి హేమను అరెస్ట్ చేసిన పోలీసులు

బెంగుళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగించిన కేసులో సినీ నటి హేమ అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే రెండు సార్లు కర్ణాటక పోలీసులు నోటీసులు పంపించినా హేమ అసలు స్పందించలేదు. పైగా తనకు ఈ కేసుతో సంబంధం లేదన్నట్లు సీన్ క్రియేట్ చేసిన హేమ మూడోసారి పోలీసులు పంపిన నోటీసులకు రెస్పాండ్ అయ్యారు. డ్రగ్స్ పరీక్షలో హేమ కూడా మాదకద్రవ్యాలు తీసుకున్నట్లు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. మే 20న బెంగుళూరు అవుట్ స్కర్ట్స్ లో ఓ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో హేమ పేరు బయటకు వచ్చింది. దీనిపై బెంగుళూరు సీసీబీ పోలీసుల విచారణ జరపగా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. రేవ్ పార్టీ నిర్వహించిన ఐదుగురిలో హేమ కూడా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే కృష్ణవేణి పేరుతో హేమ ఈ పార్టీని నిర్వహించటంతో కాస్త కన్ఫ్యూజన్ నెలకొంది. ఈ కన్ఫ్యూజన్ తనకు అనుకూలంగా మార్చుకున్న హేమ బెంగుళూరులో ఉండే హైదరాబాద్ లో ఉన్నట్లు రకరకాల వీడియోలు పెట్టి ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేశారని పోలీసులు భావిస్తున్నారు. హేమకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెను కోర్టులో హాజరపరచనున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola