Harish Rao Counters CM Revanth Reddy | బనకచర్ల ఏ బేసిన్ లో ఉందో తెలియని ముఖ్యమంత్రి | ABP Desam

మాజీ మంత్రి హరీష్ రావు బనకచర్ల అంశంలో సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని తీవ్రంగా విమర్శించారు.
"బనకచర్లను నిలిపేయండి" అని మేము చెబితే, రేవంత్ రెడ్డి మాత్రం నిన్న “బోడి గుండు కు మోకాలికి లంకె వేసినట్టు” మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హరీష్ రావు పేర్కొంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఆరు నెలలుగా బనకచర్ల ప్రాజెక్టుపై కార్యకలాపాలు కొనసాగిస్తుంటే, కేంద్ర జలశాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి వద్దకు వెళ్లి విజ్ఞప్తులు చేస్తుంటే, ముఖ్యమంత్రి మాత్రం అమాయకంగా "బనకచర్ల ఏ బేసిన్లో ఉంది?" అని ప్రశ్నించడం దారుణమన్నారు.

ఆరు నెలలుగా ఈ అంశంపై మీరు ఎంత కమిట్మెంట్ చూపారో, ఎంత శ్రద్ధ పెట్టారో, ఎంత బాధ్యతగా వ్యవహరించారో నిన్న స్పష్టమైందని, ఇది రేవంత్ రెడ్డి నిజ స్వరూపాన్ని చూపించిందని విమర్శించారు.

తెలంగాణ పొలాలకు నీళ్లు రావాలని కోరే సీఎం ఒకవైపు ఉంటే, ఆంధ్రప్రదేశ్ చేపట్టిన అక్రమ ప్రాజెక్టును ఆపాలని డిమాండ్ చేయాల్సిన సీఎం రేవంత్ రెడ్డి మాత్రం నిస్సహాయంగా అబద్ధాల వరద పారించారని ఆరోపించారు.

ఎంపీ రవిచంద్ర “బనకచర్లను ఆపాలి” అని మాట్లాడిన సందర్భంలోనూ, సీఎం రేవంత్ తప్పుడు వ్యాఖ్యలు చేశారని హరీష్ రావు పేర్కొన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola