Haimendorf 39th Death Anniversary | ఆదివాసీల ఆత్మబంధువు పేరు భావి తరాలకు నిలిచిపోయేలా చేస్తాం | ABP Desam
ఆదివాసిల ఆత్మబంధువు మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్, బెట్టి ఎలిజబెత్ దంపతుల 39వ వర్ధంతిని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని మార్లవాయి గ్రామంలో ఆదివాసీలు ఘనంగా జరుపుకున్నారు. ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ దంపతుల వర్ధంతి కార్యక్రమానికి ఖానాపూర్ ఎమ్మెల్యేతో పాటు ఎంపీ గోడం నగేష్, జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరై డార్ఫ్ దంపతులకు నివాళులు అర్పించారు. అయితే ప్రతిఏటా జనవరి 11న హైమన్ డార్ఫ్ బెట్టి ఎలిజబెత్ దంపతుల వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివాసీలు ఎందుకు నిర్వహిస్తున్నారు..? హైమన్ డార్ఫ్ ఆదివాసులకు చేసిన మెలు ఏంటి..? ఇటీవలే మంత్రి జూపల్లి కృష్ణారావు మార్లవాయి గ్రామంలో రాత్రిపూట బస చేసి గ్రామస్తులతో, విద్యార్థులతో మాట్లాడి ఏం తెలుసుకున్నారు. మర్లావాయి గ్రామ అభివృద్ధికి మంత్రి జూపల్లి ఎలాంటి కృషి చేస్తున్నారు..? హైమన్ డార్ఫ్ దంపతుల వర్ధంతి గురించి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మరియు ఆసిఫాబాద్ డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణ ఏమన్నారు ఈ కథనంలో చూద్దాం.