Governor Tamilisai: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి గవర్నర్ ప్రథమ చికిత్స | ABP Desam
తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి సమయానికి స్పందించి ఒకరి ప్రాణాలు కాపాడారు. పుదుచ్చెరి నుంచి చెన్నై వస్తుండగా... రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని చూసి కాన్వాయ్ ఆపారు. వెంటనే ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత హాస్పిటల్ కు తరలించారు. హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ వీడియోను తమిళిసై ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు.