GHMC Rides on Chicken Shops | కుళ్లిన చికెన్ అమ్మేస్తున్న దుకాణంపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు | ABP Desam

 పీకలదాకా తాగి సర్కారుకు ఆదాయమిస్తున్న మద్యం బాబులను కల్తీ సరుకు వదిలిపెట్టడం లేదు. అయితే ఆ సరుకు తాగే మందులో కాదు తినే స్టఫ్పులో ఉండటమే బాధాకరం. జీహెచ్ఎంసీ ఫుడ్ విజిలెన్స్ అండ్ కంట్రోల్ అధికారులు, టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించిన సోదాల్లో కిలోల కొద్దీ కుళ్లిన కోడి మాంసాన్ని గుర్తించారు. పార్సీగుట్టలోని A1 ఫ్రెష్ చికెన్ షాప్ లో తనిఖీలు నిర్వహించిన అధికారులు 800కిలోల కుళ్లిన చికెన్ ను గుర్తించారు. జనవరిలోనే లైసెన్స్ ఎక్స్ పైర్ అయిపోయిన ఈ దుకాణం నుంచి కిలోల కొద్దీ చికెన్ ను వైన్, బార్ షాప్ ల్లో వండే మాంసాహార వంటల కోసం పంపిస్తున్నట్లు గుర్తించారు. మద్యం మత్తులో రుచి తెలియకుండా కుళ్లిన చికెన్ తినేస్తారనే ఉద్దేశంతోనే ఈ దారుణానికి పాల్పడుతున్న దుకాణం యజమానిని అధికారులు పోలీసులకు అప్పగించారు. అతని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసు అధికారులు మీడియా కు తెలిపారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola