Harish rao at Cyberabad CP Office | సైబరాబాద్ సీపీ ఆఫీసును ముట్టడించిన BRS నేతలు | ABP Desam
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ లో చేరిన శేర్ లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తన అనుచరులు చేసిన దాడికి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించగా..తర్వాత హరీశ్ కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చి పరామర్శించారు. ఆ తర్వాత హరీశ్, సబితా ఇంద్రారెడ్డితో కలిసి కౌశిక్ రెడ్డి సైబరాబాద్ సీపీ ఆఫీసులో తన ఇంటిపై జరిగిన దాడి గురించి కంప్లైంట్ చేయటానికి వెళ్లారు. సీపీ అవినాష్ మహంతి అందుబాటులో లేకపోవటంతో పోలీసులు బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారు. అయినా లోనికి వెళ్లేందుకు ట్రై చేసిన హరీశ్ రావు, కౌశిక్ రెడ్డి ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వస్తామని అప్పుడు నీ సంగతి చూస్తామంటూ హరీశ్ రావు పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత సైబరాబాద్ జాయింట్ సీపీ కి కౌశిక్ రెడ్డి ఇంటిపై గాంధీ అనుచురలు చేసిన దాడి మీద హరీశ్ రావు కంప్లైంట్ ఇచ్చారు. ఫిర్యాదు చేసిన తర్వాత మాట్లాడిన హరీశ్ రావు...కౌశిక్ ను అరెస్ట్ చేసిన నిందితులను అరెస్ట్ చేయటంతో పాటు దాడికి సహకరించిన పోలీసులు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.