Food Safety Checking in Karimnagar | మాజీ మంత్రి హోటల్లో ఫుడ్ సేఫ్టీ చెకింగ్ | ABP Desam

తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ హోటల్లో ఆహార భద్రత అధికారుల తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా హోటల్ లో నిల్వ ఉంచుతున్నటువంటి తిను బండారులను గుర్తించి ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లపై ఉక్కు పాదం మోపుతున్నారు ఈ నేపథ్యంలో కరీంనగర్ కేంద్రంలో ఉన్నటువంటి కొన్ని ప్రముఖ హోటల్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగానే కరీంనగర్ కేంద్రంలో ఉన్నటువంటి ప్రముఖుల హోటల్ లో తనిఖీలు నిర్వహించగా ఎన్నో అబ్బురపరిచే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాజీ మంత్రి గంగుల కమలాకర్ సోదరుడు అయినటువంటి శ్వేత హోటల్లో కూడా తనిఖీలు నిర్వహించారు. మాజీ ఎంపీ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ ప్రతిమ హోటల్లో కూడా తనిఖీలు నిర్వహించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. వరంగల్ నుంచి వచ్చిన టాస్క్ ఫోర్స్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ అమృతశ్రీతో పాటు.. పలు అధికారులు ఈ దాడులు నిర్వహించారు. ఆకస్మికంగా చేసిన దాడులతో.. ఒక్కసారిగా హోటల్స్ యాజమాన్యాలు బెంబేలెత్తగా... హోటళ్లలో నిష్ఠూరమైన నిజాలు బయటపడ్డాయి. మిరియాల పేరుతో పుప్పడి గింజలను వేస్తున్నట్టు గుర్తించారు. 2021-22 సమయంలో ఇన్ గ్రేడియంట్స్ ను మసాలాలుగా వాడుతుండటంపై అధికారులు నిశ్ఛేష్ఠులయ్యారు. ఇదంతా ఓ ప్రముఖ స్టార్ హోటల్ లో బట్టబయలైంది. మొత్తంగా కల్తీ నూనెలు, కాలం చెల్లిన వంట సామాన్లు, మసాలా దినుసులను గుర్తించిన అధికారులు హోటల్ యాజమాన్యాలకు నోటీసులందించినట్టు తెలిపారు. మరిన్ని హోటల్స్ లో  కూడా సాయంత్రం వరకు ఈ తనిఖీలు జరుగుతాయని.. ఫుడ్ సేఫ్టీ యాక్ట్స్ ప్రకారం చర్యలు కూడా ఉంటాయని అమృత శ్రీ తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola