చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలు

Continues below advertisement

మిలాద్ ఉన్ నబీ సందర్భంగా చార్మినార్ వద్ద ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఉన్నట్టుండి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు లోనయ్యారు. అయితే..ఈ ప్రమాదంపై రకరకాల పుకార్లు వచ్చాయి. సోషల్ మీడియాలో ఓ ప్రచారం కూడా జరిగింది. వీటిలో ఏదీ నిజం కాదని తరవాత తేలింది. ఈ వేడుకల సమయంలో కొంతమంది టపాసులు కాల్చడం వల్ల నిప్పురవ్వలు డీజే సౌండ్ సిస్టమ్‌పై పడ్డాయి. ఆ సమయంలోనే ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక  సిబ్బంది రంగంలోకి దిగింది. మంటల్ని అదుపులోకి తీసుకొచ్చింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. అంతకు ముందు భాగ్యనగరం ఆలయం వైపు కొందరు దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదుపు చేశారు. ఈలోగా ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫలితంగా స్థానికంగా అలజడి రేగింది. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram