Fire Accident in Pashamylaram Industries | సిగాచి కెమికల్స్ లో భారీ పేలుడు
పటాన్ చెరు లోని పాశమైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. సీగాచి కెమికల్స్ పరిశ్రమలో ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. పేలుడు ధాటికి రియాక్టర్ వద్ద పనిచేస్తున్న కార్మికులు100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. పేలుడు శబ్దంతో చుట్టుపక్కల ఉన్న కార్మికులు భయంతో పరుగులు తీశారు. పరిశ్రమలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపుచేస్తున్నాయి. 20 మంది పైగా కార్మికులకు తీవ్ర గాయాలైయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్ కి తరలించారు. చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 10 మంది వరకు చనిపోయినట్లుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు పోలీసులు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు పోలీసులు. శిథిలాల కింద మరో 15 మంది కార్మికులు ఉన్నట్టు అనుమానిస్తున్నారు.
8 ఫైరింజన్లతో మంటలు అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. పేలుడు దాటికి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ పూర్తిగా కుప్పకూలిపోయింది. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్‌లోనే పెద్ద సంఖ్యలో కార్మికులు ఉన్నారు.