Farmers Protest Against Ethanol Industry | రైతులపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు | ABP Desam

జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంపెద్ద ధన్వాడ గ్రామంలో రైతులు, గ్రామస్తులు కొన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయబోయే ఇథనాల్ పరిశ్రమను అడ్డుకుంటూ నిరసన చేస్తున్నారు. ఈ పరిశ్రమను అక్కడ ఉన్న 12 గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. పనులు ఆపాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ పరిశ్రమ యాజమాన్యం పనులు నిలిపి వేయకపోవడంతో గ్రామస్థుల నిరసనలు తీవ్ర స్థాయికి చేరాయి. పోలీసులకు గ్రామస్థులకు మధ్య ఘర్షణ జరిగింది. రైతులు, గ్రామస్తులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేసారు.  పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో పలువురిని అరెస్ట్ చేసారు.12 గ్రామాల ప్రజలు ఆందోళన తీవ్ర స్థాయికి చేరింది. ప్రభుత్వం పనులు ఆపేస్తున్నామని హామీ ఇచ్చినప్పటికీ కూడా యాజమాన్యం నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ప్రయత్నించడంతో ప్రజలు వాహనాలను ధ్వసం చేశారు. టెంట్లు, కంటెయినర్లకు నిప్పు పెట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారీగా పోలీసులు మోహరించినప్పటికీ కూడా అడ్డికోలేకపొయ్యారు. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన టెంట్లను, కంటైనర్ హౌస్‌ని ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. బొలేరో ట్రక్కును తిరగేసేశారు. చాలా సమయం తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఈ 12 గ్రామాల ప్రజలు ఆరోగ్యానికి, వ్యవసాయానికి హానికరమని వ్యతిరేకిస్తున్నారు. ఈ కంపెనీకి సంబంధించి ప్రభుత్వం వెంటనే ఒక నిర్ణయానికి రావాలని డిమాండ్ చేస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola