పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులు

Continues below advertisement

డిసెంబర్ 20న మన్యం జిల్లా మక్కువ మండలంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  పర్యటన సందర్భంగా ఓ నకిలీ ఐపీఎస్ అధికారి హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. బలివాడ సూర్య ప్రకాశ్ (41) అనే వ్యక్తి పోలీసు యూనిఫాంలో ట్రైనీ ఎస్పీ అంటూ వచ్చాడు. దీనికి సంబంధించిన వివరాలను మన్యం జిల్లా అడిషనల్ ఎస్పీ దిలీప్ కిరణ్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ వ్యూ పాయింట్ వద్దకు వెళ్ళిన తర్వాత శంకుస్థాపన చేసిన ప్లేస్ వద్దకు వెళ్లి ఫోటోలు తీసుకున్నాడని.. ఆ ఫోటోలు వాట్స్ ఆప్ స్టేటస్ లో పెట్టుకున్నాడని చెప్పారు. అనుమానం రావడంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామని చెప్పారు. ఇతను 2003 నుండి 2005 వరకు పంజాబ్ లోని 26- రిజ్మెంట్ లో  సిఫాయి గా పని చేశాడు. ఆ తర్వాత పని చేయలేక అక్కడ నుండి వచ్చేశాడు. 2016 వరకు లేబర్ కాంట్రాక్ట్ పనులు చేస్తూ ఉండేవాడు. 2024 జనవరిలో ఐ.పి.ఎస్ వచ్చింది చెప్పి, ట్రైనింగ్ కు వెళ్తున్నా అని అని మాయ మాటలు చెప్పి హైదారాబాద్ వెళ్ళిపోయాడని పోలీసులు చెప్పారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram