ఎలక్ట్రిక్ వెహికిల్స్ పేలిపోకూడదంటే.. జాగ్రత్తలు ఇవే!
ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేందుకు వాహనదారుడు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు మండిపోతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు సామాన్య ప్రజలు. ఇందుకోసం విద్యుత్తు వాహనాలను కొనుగోలు చేసే వారికి అందుబాటులో ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఆర్టీసీ సంస్థల్లో కూడా ఎలక్ట్రిక్ వాహనాలను నడుపుతున్నాయి. దీనితో పెట్రోల్ డీజిల్ భారం తగ్గడమే కాకుండా పర్యావరణాన్ని కూడా కాపాడే ప్రయత్నంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి...
పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉండటంతో సామాన్య ప్రజలు వాహనాలు రోడ్లపై నడపాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే జపాన్, జర్మనీ, చైనా, భారతదేశ టెక్నాలజీలతో విద్యుత్ వాహనాలు మార్కెట్లోకి అందుబాటులో రావడంతో విద్యుత్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు సామాన్య ప్రజలు. అయితే సామాన్య ప్రజలు పెట్రోల్ భారం నుంచి భారం తగ్గించుకుందామని విద్యుత్ వాహనాలను కొనుగోలు చేస్తే మరొక మరొక తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయి విద్యుత్ వాహనాలు లక్షల రూపాయలు వేచించి విద్యుత్ వాహనాలను కొనుగోలు చేస్తే అవికాస్త షాక్ సర్క్యూట్, ఫైర్ ఫైర్ యాక్సిడెంట్ లాంటి సమస్యల తో కొత్త తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయి. దానితో ఎలక్ట్రిక్ వాహనాలు వాడే వాహనదారుల్లో మరొక గుబులు పుట్టిస్తోంది.