Elections 2024 Counting Live Updates |నేతల అంచనాలు తలకిందులయ్యేలా ఓటర్ల తీర్పు..! | ABP Desam
నేతల అంచనాలు తలకిందులయ్యేలా ఓటర్ల తీర్పు..! | ABP Desam
తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇక్కడ బీఆర్‌ఎస్ నామమాత్రపు పోటీ ఇస్తోంది. తెలంగాణ ఎంపీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. 8 స్థానాల్లో బీజేపీ, 7 స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం చెరో స్థానంలో కొనసాగుతున్నారు. మల్కాజిగిరి, చేవెళ్ల, సికింద్రాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నిజామాబాద్, ఆదిలాబాద్ లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. అటు, నల్గొండ, భువనగిరి, ఖమ్మం, జహీరాబాద్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్ లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. అలాగే, మెదక్ లో బీఆర్ఎస్, హైదరాబాద్ లో ఎంఐఎం లీడ్ లో ఉంది.మెదక్‌లో పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి పి.వెంకట్రామిరెడ్డి తొలుత వెనుకంజలో ఉన్నా ఇప్పుడు లీడ్ లో కొనసాగుతున్నారు.
తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇక్కడ బీఆర్‌ఎస్ నామమాత్రపు పోటీ ఇస్తోంది. తెలంగాణ ఎంపీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. 8 స్థానాల్లో బీజేపీ, 7 స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం చెరో స్థానంలో కొనసాగుతున్నారు. మల్కాజిగిరి, చేవెళ్ల, సికింద్రాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నిజామాబాద్, ఆదిలాబాద్ లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
Tags :
Elections Counting Telangana #abp Telugu News ELECTIONS 2024 #telugu News #ABP Desam Elections 2024 Live