ED Searches In BRS MLA Mahipal Reddy House | పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నివాసంలో ఈడీ | ABP

ED Searches In BRS MLA Mahipal Reddy House: 

పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. గనుల వ్యవహారంలో నమోదైన కేసుపై ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నేత, పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి (Mahipal Reddy) ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) సోదాలు నిర్వహించింది. గురువారం ఉదయం 5 గంటల నుంచి పటాన్ చెరులోని ఆయన నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి నివాసంలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. పటాన్ చెరులోని 3 ప్రాంతాలతో పాటు నిజాంపేటలోని మహిపాల్ రెడ్డి బంధువుల నివాసాల్లోనూ సోదాలు చేస్తున్నారు. గతంలో లగ్డారం గనుల వ్యవహారంలో స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో మహిపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డిపైనా కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. బినామీ పేర్లతో మైనింగ్ వ్యాపారాలు చేస్తున్నట్లు గుర్తించారు. రియల్ ఎస్టేట్స్ వ్యాపారంలో బినామీ పేర్లతో పెట్టుబడి పెట్టినట్లు ఈడీ అధికారులు పేర్కొంటున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola