దోమల్‌గూడలో భారీ చోరీ, వైరల్ అవుతున్న సీసీ ఫుటేజ్

Continues below advertisement

హైదరాబాద్‌లో భారీ చోరీ జరిగింది. అన్న ఇంట్లో తమ్ముడు దొంగతనానికి పాల్పడ్డాడు. 11 మంది బందిపోటు దొంగలతో కలిసి ఈ చోరీ చేశాడు. ఈ ఘటనలో పోలీసులు మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. కోటి 20 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలని స్వాధీనం చేసుకున్నారు. దోమల్‌గూడలో ఈ చోరీ జరిగింది. కత్తులు, పెద్ద పెద్ద బ్లేడ్‌లతో పాటు లైటర్ గన్‌తో ఇంట్లోకి చొరబడిన ఈ గ్యాంగ్..బంగారం, వెండితో పాటు 2.9 లక్షల నగదు చోరీ చేసి పరారయ్యారు. వ్యక్తిగత కక్షతోనే ఈ దొంగతనానికి పాల్పడినట్టు విచారణలో తేలింది. అప్పుల్లో కూరుకుపోయిన నిందితుడు ఇంద్రజిత్..అన్న ఇంట్లో చొరబడి ఇలా దొంగతనం చేశాడు. సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ టీమ్‌ రంగంలోకి దిగి ఈ 12 మంది దొంగల్ని పట్టుకుంది. ఈ చోరీకి సంబంధించిన సీసీ ఫుటేజ్ వైరల్ అవుతోంది. అన్న ఆస్తులు పెరుగుతుంటే..తాను మాత్రం అప్పుల్లో కూరుకుపోతున్నానన్న బాధతో తమ్ముడు ఈ చోరీకి పాల్పడినట్టు తేలింది. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు..విచారణ కొనసాగిస్తున్నారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram