Director Jennifer Alphonse Interview | నాగోబా, గుస్సాడీని వరల్డ్ ఫేమస్ చేసే వరకూ ఆగను | ABP Desam
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము అన్న తీరు జెన్నిఫర్ ఆల్ఫోన్స్ ఆలోచనను చరిత్రను తిరగరాసింది. అదిలాబాద్ అడవి బిడ్డలు, ఆదివాసీల ప్రాచీన నాగరికత, వారి ఆనవాళ్లు వారి వన దేవతలు, పోరాట వీరుల గురించి విశ్లేషణాత్మకంగా డాక్యుమెంటరీలు తీసి జెన్నీ అందరిని ఆకట్టుకున్నారు. హైదరాబాద్ లో ఉన్న జర్నీ ఆదిలాబాద్ అడవుల్లోకి వచ్చి నాగుబజాతర గుస్సాడీ కొమురం భీం పోరాట వీరుడు జంగుబాయి ఇలా పలు రకాల ఆదివాసీల చరిత్రలు భావితరాలకు అందించే దిశగా డాక్యుమెంటరీలను తీశారు. వీటిపై ఆమె ఎన్నో అవార్డులను దక్కించుకుంది. ఇంతకీ జెన్నీఫర్ ఆల్ఫోన్స్ కు ఆదిలాబాద్ అడవి బిడ్డల చరిత్ర గురించి డాక్యుమెంటరీలు తీయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది..? ఇప్పటివరకు ఆదివాసీల చరిత్ర గురించి ఎన్ని డాక్యుమెంటరీలు తీశారు..? అడవి బిడ్డల మధ్య ఆమె స్థానం ఎలా సంపాదించుకుంది..? డాక్యుమెంటరీలపై ఎన్ని అవార్డులు దక్కించుకున్నారు..? ఇంకా ముందు ఏ చరిత్రలపై ఆలోచన పెట్టారు..? ఈ అంశాలపై జెన్నిఫర్ ఆల్ఫోన్స్ తో abp దేశం ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ.