రేవంత్ కు చప్పట్లు కొట్టకపోతే కాంగ్రెస్ లో ఇంతే : దాసోజు శ్రావణ్ | ABP Desam
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తాను రాజకీయనామా చేయడానికి రేవంత్ రెడ్డి అహంకారమే కారణమంటూ విరుచుకుపడ్డారు ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్.కేసీఆర్ ను ఓడించే సత్తా రేవంత్ కు లేదు, కానీ సొంత పార్టీ నేతలను వేధించడం, తొక్కేయడం మాత్రం తెలుసు. అందుకే మునిగిపోతున్న రేవంత్ కాంగ్రెస్ లో ఉండలేక వెళ్తున్నాని ABP దేశం ప్రత్యేక ఇంటర్వ్యూలో అన్నారు శ్రావణ్.