Congress MLA Mandula Samel | ఎమ్మెల్యే మందుల సామెల్ వసూళ్ల వీడియో
ఎన్నికల్లో ఖర్చు పెట్టింది రికవరీ కావాలి వైరల్ అవుతున్న సామెల్ వసూళ్ల వీడియో. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ కి సంబందించిన ఒక వీడియో ప్రస్తుతం ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ లో వైరల్ అవుతుంది. లిక్కర్ సిండికేట్ నిర్వాహకుల నుంచి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మామూళ్ళ వసూల వీడియో అంటూ ఒక వీడియో వైరల్ అవుతుంది. ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టా రికవరీ కావాలి, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు అంటూ ఆ వీడియోలో మాటలు వినిపిస్తున్నాయి. రోజుకు లక్ష ఖర్చు వస్తుందని, డీజిల్ కు కూడా డబ్బులు లేవని, ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపొవట్లేదని అక్కడ ఉన్నవారికి చెబుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. నా మాట వినని వారి సంగతి చూస్తా అంటూ బెదిరిస్తున్నట్లుగా వీడియో వైరల్ అవుతోంది. అక్కడున్న వారు ఎవరో ఇదంతా సీక్రెట్ గా కెమెరాలో రికార్డ్ చేసారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో బాగా చెక్కర్లు కొడుతుంది.