Congress Leaders on Jeevan Reddy Upset| జగిత్యాల MLA సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరికపై కార్యకర్తలు

Continues below advertisement

 జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ చేరికపై కార్యకర్తలు సంతృప్తినే వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి గౌరవానికి ఎలాంటి లోటు ఉండదంటున్న కార్యకర్తలు ఆయన జగిత్యాల కాంగ్రెస్ కు ద్రోణాచార్యుడని చెబుతున్నారు. జీవన్ రెడ్డి అలకపై కాంగ్రెస్ శ్రేణుల అభిప్రాయాలు ఈ వీడియోలో. జగిత్యాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవటంపై ఎమ్మెల్సీ టీ. జీవన్ రెడ్డి అలక బూనారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే సంజయ్ కుమార్ ను పార్టీలో చేర్చుకున్నప్పుడు..తన లాంటి సీనియర్ లీడర్ కి, పార్టీ క్యాడర్ కి ఒక్క మాట కూడా చెప్పకపోవటం ఏంటీ అనేది జీవన్ రెడ్డి ఆవేదన గా కనిపిస్తోంది. ఇదే కోపంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరారన్న వార్త బయటకు రాగానే జీవన్ రెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు చేరుకున్నారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, మాజీ మంత్రిగా, కరీంనగర్ లో కాంగ్రెస్ కు పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్న జీవన్ రెడ్డికి తెలియకుండా సంజయ్ కుమార్ ను చేర్చుకోవటం ఏంటంటూ ఆందోళన దిగారు. ఇదే క్రమంలో భావోద్వేగానికి లోనైన జీవన్ రెడ్డి..తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పార్టీలోనే ఉండి న్యాయం కోసం కొట్లాడతారని వార్తలు బయటకు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ అగ్రనేతలు అప్రమత్తం అయ్యారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నిన్న సాయంత్రం జీవన్ రెడ్డి ఇంటికి చేరుకుని దాదాపుగా రెండు గంటల పాటు చర్చించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram