రచ్చబండ కు వెళ్తున్న కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి హౌస్ అరెస్టు
కాంగ్రెస్ ఆధ్వర్యంలో తలపెట్టిన రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు .ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగానే ధాన్యం సంబంధించి సమస్యలు ఎదురవుతున్నాయి అని.... గతంలో మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న పంటని భారీ ఎత్తున కొన్న ప్రభుత్వాలకు విరుద్ధంగా ప్రస్తుతం అన్ని సెంటర్లు మూసివేయడంతో రైతులు కూడా ప్రత్యామ్నాయం కోసం వరి వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తోందని అందరూ భావిస్తే దానికి విరుద్ధంగా , రాచరికం లాంటి పాలన కొనసాగుతోందని ఆయన విమర్శించారు.
Tags :
Jeevan Reddy Congress Leader Jeevan Reddy Jeevan Reddy House Arrest Congress Leader House Arrest