ఆదిలాబాద్‌ని గజగజ వణికిస్తున్న చలిగాలులు
రాష్ట్రవ్యాప్తంగా చలి విపరీతంగా పెరిగిపోయింది. వారం రోజుల క్రితం అంతంతమాత్రంగానే ఉన్నా...ఇప్పుడు తీవ్రమైంది. చాలా చోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచే చలిగాలి మొదలవుతోంది. కొన్ని చోట్ల సింగిల్ డిజిట్ టెంపరేచర్ నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మరీ ముఖ్యంగా..ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోవడంతో ప్రజలు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో, అటు పట్టణాల్లో సైతంఎక్కడ చూసినా కాలనీల్లో ఇంటింటా చలి మంటలు కాగుతూ కనిపిస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యల్పంగా కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. డిజిట్లలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వృద్ధులు, చిన్నారులు, వేకువ జమున లేవలేక పోతున్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, చిరు వ్యాపారులు, వ్యవసాయ రైతులు, ప్రయాణికులు చలి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలికి గజగజా వణుకుతు.. ఇబ్బందులు పడుతున్న ప్రజలపై abp దేశం ప్రత్యేక కథనం.