Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు

అర్దం చేసుకోవాలి.. అభిరుచులు పంచుకోవాలి.. వీలైతే కలసి జీవించాలి. ఇవన్నీ ఓకే అనుకుంటేనే పెళ్లికి సై అనాలి. ఇలా నేటితరం యువత ఆలోచనధోరణి వేగంగా మారుతోంది. పెళ్లికి ముందే అమ్మాయి,అబ్బాయి కలసి జీవించాలంటే, ఎవరేమనుకుంటారనే భయం. హైదరాబాద్ నగరంలో ఇళ్లు అద్దెకు ఇవ్వరనే ఆందోళన. ఈ టెన్షన్ లేకుండా  కోలివింగ్ పీజీలో ఉంటే సరిపోతుంది. ఓకే గదిలో కలసి జీవించవచ్చు. ఒకరినొకరు అర్దం చేసుకోవచ్చు.ఇంకా క్లారిటీగా చెప్పాలంటే తాళి కట్టడం తప్ప మిగతా అన్నీ ఆశ్వాదించవచ్చు. అందుకే హైదరాబాద్ నగరంలో ఇటీవల కాలంలో కోలివింగ్ హాస్టల్స్ సంఖ్య వేగంగా పెరిగుతోంది. అమ్మాయి,అబ్బాయి కలసి ఒకే గదిలో పెళ్లికి ముందే జీవించడం అంటే నోరెళ్లబెట్టి చూసే రోజులు ఇంకా మారనప్పటికీ, మా జీవితం, మా ఇష్టం అన్నట్లుగా కోలివింగ్ కు జై కొట్టేవారు కొందరైతే, అమ్మాయితో కలసి ఉన్నంత మాత్రాన అలా తప్పుగా అనుకోవద్దంటున్నారు మరికొందరు.కోలివింగ్ పీజీలో ఎటువంటి సౌకర్యాలుంటాయి. ఇతర జంట్స్ , లేడీస్ హాస్టల్స్ తో పోల్చినప్పుడు హైదరాబాద్ నగరంలో కోలివింగ్ పీజీలలో ఉండే ప్రత్యేకతలేంటి అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. దీనిపై కోలింగ్ పీజీ నిర్వాహకులు ఏమంటున్నారంటే..

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola