CM Revanth Reddy Telangana Formation Day Celebrations | ట్యాంక్ బండ్ పై ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

Continues below advertisement

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన సంబురాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ హాజరయ్యారు. గవర్నర్‌తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన కళాకారులు.. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని చాటిచెప్పేలా 17 కళలను ప్రదర్శించారు. జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతానికి ఐదు వేల మంది ట్రైనీ పోలీసులతో నిర్వహించిన ఫ్లాగ్‌ వాక్‌ ఆకట్టుకుంది.  ప్రత్యేక కార్యక్రమాలను వీక్షించేందుకు నగరవాసులు భారీగా తరలిరావడంతో ట్యాంక్‌బండ్‌ పరిసరాలు జనసంద్రంగా మారాయి. వేడుకలు జరుగుతున్న సమయంలో వర్షం పడటంతో సాంస్కృతిక కార్యక్రమాలకు ఆటంకమేర్పడింది.వర్షంలో తడుస్తూనే సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని కొనసాగించారు. కార్యక్రమం చివర్లో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి, అందెశ్రీకి సన్మానం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉదయం పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన కార్యక్రమంలోనే అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి జయ జయహో తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించి జాతికి అంకితమిచ్చారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram