CM Revanth Reddy One Crore For Rahul Sipligunj | రాహుల్ సిప్లిగంజ్ కు తెలంగాణ ప్రభుత్వం నజరానా | ABP Desam

 సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం తరపున కోటి రూపాయల నజరానా ప్రకటించారు. తెలంగాణ యువతీ యువకులను విభిన్న రంగాల వైపు ప్రోత్సహించేందుకు ప్రణాళికలు రచించామన్న సీఎం రేవంత్ రెడ్డి అందులో భాగంగా పాతబస్తీ కుర్రాడు రాహుల్ సిప్లిగంజ్ కు ఏదైనా చేయాలని గద్దర్ అవార్డుల వేడుకలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆదేశించారు. RRR సినిమాలో నాటు నాటు పాటను కాలభైరవతో కలిసి పాడిన రాహుల్  సిప్లిగంజ్ ను ఆ పాటను ఆస్కార్ వేదికపై ప్రదర్శించి ఆ ఘనత అందుకున్న తొలి భారతీయ సింగర్ గా రికార్డు సృష్టించాడు. నాటుకు నాటు పాటకు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డును అందుకుని చరిత్ర సృష్టించగా...పాతబస్తీ కుర్రాడు రాహుల్ సిప్లిగంజ్ ను సముచితంగా గౌరవించాలని రేవంత్ రెడ్డి అప్పటి నుంచి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా...రాహుల్ సిప్లిగంజ్ ను కాంగ్రెస్ ప్రచార కమిటీ కార్యక్రమాల్లోనూ రేవంత్ రెడ్డి భాగస్వామ్యం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో రాహుల్ సిప్లిగంజ్ ప్రతిభకు కోటి రూపాయల నజరానాతో సరైన గౌరవం లభించినట్లైంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola