CM Revanth Reddy on Vikarabad Forests | వికారాబాద్ అడవులతో లాభాలు ఏంటో తెలుసా.? | ABP Desam
వికారాబాద్ అడవుల గొప్పతనాన్ని చిరంజీవికి వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో వికారాబాద్ అడవుల విషయంలో ఉన్న నానుడి ఏంటో చెప్పారు రేవంత్ రెడ్డి. చిలుకూరు బాలాజీ టెంపుల్ లో రోడ్ లో ఉన్న పొద్దుటూరు గ్రామంలో ఎక్స్ పీరియమ్ బొటానికల్ థీమ్ పార్క్ ను ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నూట యాభై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఎక్స్ పీరియమ్ థీమ్ పార్క్ లో 25 వేల రకాల మొక్కల ను తీసుకుని వచ్చి పెట్టినట్లు ఫౌండర్ రామ్ దేవ్ తెలిపారు. మెగా స్టార్ చిరంజీవితో కలిసి ఈ ఎక్స్ పీరియమ్ థీమ్ బొటానికల్ గార్డెన్స్ ఓపెనింగ్ లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను ఎకో టూరిజం స్టేట్ గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పర్యాటకంగానూ ఆకర్షింపచేసే ఎక్స్ పీరియమ్ లాంటి ప్రాజెక్టు ల ప్రగతి కోసం ప్రభుత్వం అండగా ఉంటుందన్న రేవంత్ రెడ్డి తెలంగాణను ప్రకృతి వనంగా మార్చటమే తన ధ్యేయం అని చెప్పారు.