
CM Revanth Reddy on Three Mysterious Deaths | కళ్ల ముందే మూడు మరణాలు..లింక్ ఇదేనంటున్న సీఎం రేవంత్
ఢిల్లీ టూర్ లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ ను షేక్ చేస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే...ఢిల్లీలో ప్రధాని మోదీని కలవటానికి వెళ్లిన సీఎం రేవంత్ ...ఆ మీటింగ్ అయిపోయాక ఢిల్లీ మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడారు. మాట్లాడుతూ మాట్లాడుతూనే తెలంగాణకు రిలేటెడ్ గా మూడు మరణాలు జరిగాయి వాటి మధ్య లింకులు మీకు అర్థం అవుతోందా ….ఈ పాటికే మీరు అర్థం చేసుకోవాలి కదా అంటూ అసలు విషయం ఏంటో చెప్పారు.
తెలంగాణలో మూడు మరణాల గురించి ప్రత్యేకంగా చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి . మొదటిది లాయర్ సంజీవ్ రెడ్డి గుండెపోటుతో మరణం. ఆరు నెలల క్రితం కాళేశ్వరం కేసు డ్రాఫ్టింగ్ చేస్తున్న రోజునే న్యాయవాది సంజీవరెడ్డి గుండెపోటుతో మరణించారని రేవంత్ రెడ్డి చెప్పారు. సంజీవ్ రెడ్డి పిల్లలు అమెరికాలో ఉండగా.. సంజీవ్‌రెడ్డి తన భార్యతో కలిసి హన్మకొండ అడ్వకేట్స్ కాలనీలో నివాసించేవారు. గతంలోసంజీవరెడ్డి జీపీగా పనిచేశారు. అలాంటి వ్యక్తి అకస్మాత్తుగా చనిపోవటం వెనుక అనుమానాలు ఉన్నాయన్నారు రేవంత్ రెడ్డి.
రెండో మరణం మేడిగడ్డపై కేసులు పెట్టిన రాజలింగ మూర్తి మర్డర్. మేడిగడ్డ అవినీతిని బయటపెట్టి.. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుపై నిందితులుగా నిలబెట్టిన భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి అనే సామాజిక కార్యకర్త ఫిబ్రవరి 19వ తేదీ సాయంత్రం హత్యకు గురయ్యారు. భూపాలపల్లి కోర్టులో కేసీఆర్, హరీశ్‌రావుకు వ్యతిరేకంగా ఆయన కేసు దాఖలు చేశారు. వారి పిటిషన్ హైకోర్టు విచారించడానికి ముందురోజు రాజ లింగమూర్తి హత్యకు గురికావడం రాష్ట్రంలో పెను సంచలనం రేపింది. ఈ హత్య వెనుక అసలు కారణాలు తేల్చటానికి ఈ కేసును సీరియస్ గా ఇన్వెస్టిగేట్ చేయమని పోలీసులకు చెప్పినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
ఇక మూడో మరణం.. దుబాయిలో ఓ వేడుకకు హాజరైన సినీ నిర్మాత కేదార్ సలగంశెట్టి మృతి. ఆయన ఎన్ని రోజుల కింద మృతిచెందారన్నది..అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. అనారోగ్యంతో మరణించారా? లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే అంశం బయటపడలేదు. కేదార్ ప్రొడ్యూసర్ తో పాటు కేటీఆర్ కి క్లోజ్ గా ఉండేవ్యక్తి అనేది సీఎం రేవంత్ ఆరోపణ. మరి కేటీఆర్ తనకు కావాల్సిన వ్యక్తి చనిపోతే ఎందుకు ఎంక్వైరీ అడగటం లేదు..ఎంక్వైరీ అడిగితే ప్రభుత్వం వేస్తుంది కదా అనేది రేవంత్ ప్రశ్న. పైగా కేదార్ రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో నిందితుడిగా కూడా ఉన్నారు.
సో ఈ మూడు మరణాలను కలిపి చూసినప్పుడు వీటికి ఉన్న లింక్స్ ఏంటో మీకు అర్థం కావటం లేదా ఢిల్లీలో జర్నలిస్టుల మందు బాంబు పేల్చారు సీఎం రేవంత్ రెడ్డి.