CM Revanth Reddy on KCR | Telangana Formation Day|కేసీఆర్ ను సన్మానించే యోచనలో రేవంత్ రెడ్డి సర్కార్
మాజీ సీఎం కేసీఆర్ ను ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సన్మానిస్తే ఎలా ఉంటుంది ?. ఉహించుకోవడానికి బాగానే ఉంటుంది కానీ అది సాధ్యమా అంటే.. కేసీఆర్ అంగీకరిస్తే సాధ్యమయ్యే అవకాశాలు ఉంటాయి. తెలంగాణ సాధనలో అత్యంత కీలక వ్యక్తిగా కేసీఆర్ ను గుర్తించి సన్మానించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉంది.
మాజీ సీఎం కేసీఆర్ ను ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సన్మానిస్తే ఎలా ఉంటుంది ?. ఉహించుకోవడానికి బాగానే ఉంటుంది కానీ అది సాధ్యమా అంటే.. కేసీఆర్ అంగీకరిస్తే సాధ్యమయ్యే అవకాశాలు ఉంటాయి. తెలంగాణ సాధనలో అత్యంత కీలక వ్యక్తిగా కేసీఆర్ ను గుర్తించి సన్మానించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉంది. రాష్ట్రం ఏర్పడిన పదేండ్లకు...వేడుకలు నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం రావడంతో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఘనంగా సన్మానించాలని ప్రభుత్వం నిర్ణంచింది. వేలాదిమంది ఉద్యమించినా, ప్రధాన ఉద్యమకారుడిగా, తెలంగాణ తెచ్చిన గొప్ప నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాబట్టి సోనియాతోపాటు కేసీఆర్ ను కూడా ఘనంగా సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆయనకు ఆహ్వానం పంపాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే కేసీఆర్ ను బీఆర్ఎస్ నేతలు తెలంగాణ బాపుగా అభివర్ణిస్తారు. అంటే తెలంగాణకు జాతిపిత ఆయనే అన్న రేంజ్ లో ఊహించుకుంటారు. అలాంటిది ఇప్పుడు సోనియాను ఆహ్వానించే కార్యక్రమానికే కేసీఆర్ వెళితే.. తెలంగాణ రావడానికి కృషి చేసిన వందలో ఒకడిగా కేసీఆర్ ను చూపిస్తారు తప్ప కేసీఆర్ ఒక్కడే తెలంగాణ రావడానికి కారణం అన్న ఇమేజ్ పోతుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అందుకే కేసీఆర్ ఈ కార్యక్రమానికి రాకపోవచ్చని అంటున్నారు. ఐతే.. తెలంగాణ ప్రభుత్వం నుంచి కేసీఆర్ కు అధికారికంగా ఆహ్వానం పంపిన తర్వాతే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు... కేసీఆర్ ను మానసికంగా ఇబ్బంది పెడుతూ..ప్రజల్లో బ్యాడ్ చేసేందుకు రేవంత్ రెడ్డి ఇలాంటి ఎత్తుగడలను ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.