CM Revanth Reddy on KCR Life Threat | కేసీఆర్ ప్రాణాలకు ప్రమాదం..సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు | ABP

Continues below advertisement

తెలంగాణ ఉభయ సభల్లో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన ఆయన మాజీ సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీ విధానాలపై విరుచుకుపడ్డారు. కేసీఆర్‌కు సొంత కుటుంబ సభ్యుల నుంచే ప్రాణ హాని ఉందని ఆరోపించారు. ఆయన సభకు రెండురోజులే హాజరైనా ఇప్పటి వరకు లక్షల్లో జీతం తీసుకున్నారని సభకు వివరించారు. ఈ టైంలో కేసీఆర్ ఫ్యామిలీపై మరో సంచలన ఆరోపణ చేశారు రేవంత్. కేసీఆర్‌కు కుటుంబ సభ్యుల నుంచే ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే పోలీసు సెక్యూరిటీ మధ్యలో కుటుంబానికి దూరంగా ఫామ్‌హౌస్‌లో ఉంటున్నారని చెప్పుకొచ్చారు.ప్రజల సంపదను జీతభత్యాలుగా తీసుకుంటున్న కేసీఆర్ సభకు రాకుండా ప్రజలను వారి ఖర్మకు వదిలేశారని ఆరోపించారు రేవంత్. ఆయన ట్రైనింగ్‌లో వచ్చిన బీఆర్‌ఎస్ నేతలు రేబిస్ వ్యాక్సిన్ వికటించినట్లుగా ప్రవర్తిస్తున్నారని కామెంట్స్ చేశారు. వీళ్లు ఇలానే వ్యవహరిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గుండు సున్నా ఖాయమని హెచ్చరించారు.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram