CM Revanth Reddy Helps For Baby Girl Treatment: అన్నా అని పిలవగానే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
మాజీ సీఎం కేసీఆర్ ఆసుపత్రిలో ఉంటే, వెళ్లి పరామర్శించినందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. నిన్న అక్కడే జరిగిన మరో సంఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. యశోదా హాస్పిటల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి ఉండగా... ఓ మహిళ అన్నా అంటూ రేవంత్ ను పిలిచారు. వెంటనే స్పందించిన రేవంత్ ఆమె వద్దకు వెళ్లారు. పాప వైద్యానికి ఖర్చు ఎక్కువ అవుతోందంటూ ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి.... పక్కనే ఉన్న అధికారులకు వారికి సాయం చేయాలని ఆదేశించారు.