CM KCR: హెల్త్ బడ్జెట్ పై పైసా పెంచలేదు కానీ ఉన్నది తగ్గించారు..?
ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ నిపుణులంతా రాబోయే సవాళ్లను ఎదుర్కోవటానికి ఆరోగ్యరంగంపై కేటాయింపులు చేయాలని సూచిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. కానీ బీజేపీ మాత్రం హెల్త్ బడ్జెట్ పై పైసా పెంచకపోగా...ఉన్నది తగ్గించటం దారుణమన్నారు. బీజేపీ అంటే దేశాన్ని అమ్ముడు...మతపిచ్చి లేపుడు అన్నట్లు పరిస్థితి తయారైందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.