కేసీఆర్ గ్రీన్ ఛాలెంజ్.. జమ్మి మొక్కను నాటిన ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామీజీ "గ్రీన్ ఇండియా ఛాలెంజ్" కార్యక్రమంలో పాల్గొని, ఈరోజు శంషాబాద్, శ్రీ ఆశ్రమంలో జమ్మి చెట్టును నాటారు. ప్రకృతి పరిరక్షణకు గొప్ప కారణంగా "గ్రీన్ ఇండియా ఛాలెంజ్" ఒక వేదికగా నిలుస్తుంది. ఈ కార్యక్రమం లో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కూడా పాల్గొన్నారు.