CM KCR At Pragathi Bhavan: కర్ణాటక, తమిళనాడు నాయకులకు కేసీఆర్ ఆతిథ్యం
మరికాసేపట్లో సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన జరగబోతోంది. ఇప్పటికే దీని గురించి అంతటా చర్చ నడుస్తోంది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కీలక నాయకులు హైదరాబాద్ కు వచ్చారు. కర్ణాటకలో జేడీఎస్ ముఖ్య నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చారు. తమిళనాడు నుంచి విదుతాలై చిరుతైగల్ కచ్చి పార్టీ అధినేత తిరుమావళవన్, ఇతర నాయకులు ప్రగతిభవన్ కు చేరుకున్నారు. ప్రగతిభవన్ కు వచ్చిన ఇరు నాయకుల బృందాలను కేసీఆర్, కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారికి అల్పాహార విందు ఇచ్చారు.