Chengicherla Bandi Sanjay High Tension: చెంగిచెర్లలో బండి సంజయ్ పర్యటనతో తీవ్ర ఉద్రిక్తత
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని చెంగిచెర్లలో హైటెన్షన్ నెలకొంది. హోలీ పండుగ సందర్భంగా రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడ్డవారిని పరామర్శించేందుకు బండి సంజయ్ అక్కడికి వచ్చారు. అయితే పోలీసులు బ్యారికేడ్లు అడ్డుపెట్టటంతో, సంజయ్, కార్యకర్తలు ఆగ్రహించారు. వాటిని తోసుకుంటూ ముందుకు కదిలారు. బండి సంజయ్ బాధితులను పరామర్శించి, వారితో మాట్లాడారు.