Caste Census Re Survey in Telangana | ఫిబ్రవరి 16నుంచి తెలంగాణలో కుల గణనకు మరో అవకాశం | ABP Desam

 ఫిబ్రవరి 16 నుంచి 26 వరకూ మరోసారి కులగణన చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. గత సర్వేలో పాల్గొనని వాళ్లు ఈ సారి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని భట్టి చెప్పారు. అయితే ఆల్రెడీ చేసిన సర్వేకు సంబంధించిన డేటాను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రేవంత్ సర్కారు ఇప్పుడు మరో అవకాశం అంటూ మరోసారి సర్వే చేయటం దేనికి నిదర్శనం అనేది బీఆర్ఎస్ సహా ప్రతిపక్షాల ప్రశ్న. అంటే తొలి సర్వే తప్పుల తడకగా ఉందనే ఆరోపణలను కాంగ్రెస్ సర్కార్ అంగీకరించిందా...లేదా మరింత పకడ్బందీగా సర్వే చేసి కులాల లెక్కలు తేలితే సామాజిక సమీకరణాల ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారా.? వీటిలో ఏది నిజం...ఏది ప్రచారం..ఏబీపీ దేశం ఇన్ పుట్ ఎడిటర్ వై.సుధాకర్ రావు చేస్తున్న విశ్లేషణ ఈ వీడియోలో మీ కోసం. కులగణన సర్వేపై వచ్చిన వస్తున్న అన్ని విశ్లేషణల సమహారం ఈ వీడియో గాా మీ ముందుకొస్తోంది. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola