Car Stunts And Racing In Ananthagiri Hills: కార్ల స్టంట్స్ తో హడలెత్తిస్తున్న యువత
వికారాబాద్ జిల్లాలోని ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అనంతగిరి హిల్స్ వద్ద కొందరు యువకులు హల్ చల్ చేశారు. ఆగస్ట్ 15వ తేదీన సెలవు కావటంతో... హైదరాబాద్ నుంచి చాలా మంది కార్లలో బైక్లలో అక్కడికి చేరుకున్నారు. పోలీస్ సైరన్ వేసుకుని మరీ కార్లతో స్టంట్స్, రేసింగ్ చేస్తూ హడావిడి చేశారు. అంతే కాదు కాస్త జాగ్రత్తగా వినండి.... మధ్య మధ్యలో కాల్పులు కూడా వినిపిస్తున్నాయి. ఎయిర్ గన్స్ వాడుతున్నట్టు సమాచారం. ఈ వీడియోలు స్థానికులు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.