BRS Party Merge Into BJP | బీఆర్ఎస్ బీజేపీలోకి విలీనం... దీనిలో ఉన్న వాస్తవమెంత..? | ABP Desam
BRS Party Merge Into BJP BRS పార్టీ బీజేపీలోకి విలీనం అవుతుంది..! ఇది 100శాతం పక్కా సమాచారం అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఐతే.. ఒక్క ఓటమితో తట్ట బుట్ట సర్దుకునే రకమా కేసీఆర్..? మరి..కేసీఆర్ పార్టీ విలీనం చేస్తారంటే ఎలా నమ్మమంటారు అని చాలా మంది అడుగుతున్నారు. ఆ డౌట్ ఉన్న వారందరికి ఇదే మా సమాధనం..! అసలు..పార్టీలు ఎందుకు విలీనం చేస్తారు..? కేసీఆర్ ఎందుకు చేయాలి..? చేయకూడదో..? మనం ఇప్పుడు మాట్లాడుకుందాం..!
ఫస్ట్.. ఏదైనా ఒక పార్టీ ఇంకో పార్టీలో ఎందుకు విలీనం చేస్తారు..!
1. అధికారంలోకి ఇగ రాము.. ప్రధాన ప్రతిపక్షంగానూ జనాలు చూడట్లేదు. ఇంకెన్నాళ్లు ప్రతిపక్షంలోనే పార్టీని నడపాలి. డబ్బుల్లేవు అనుకున్నప్పుడు పార్టీని విలీనం చేస్తారు
2. నాయకత్వం లేనప్పుడు.. ఒక లీడర్ ఛరిష్మాతోనే ఒక పార్టీ నడిచిందనుకుండో ఆ లీడర్ చనిపోయినా లేదా వయసైపోయినా ఇగ పార్టీ నడపలేం అంటూ విలీనం చేస్తారు.
3. కేసులు..! పెద్ద పెద్ద కుంభకోణాల్లో ఇరుక్కున్నప్పుడు సెంట్రల్ లో పవర్ లో ఉండే పార్టీలో విలీనం చేస్తే సీబీఐ, ఈడీ కేసుల నుంచి తప్పించుకోవచ్చు అన్నప్పుడు కూడా విలీనం చేసే అవకాశం ఉంది.