రేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారు

Continues below advertisement

తెలంగాణ భవన్‌లో కొడంగల్ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకుల సమావేశం జరిగింది. ఇందులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, నవీన్ రెడ్డి, గోరేటి వెంకన్న, పార్టీ సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ‘‘రేవంత్ రెడ్డికి దమ్ముంటే కనీసం 15 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలి. రాష్ట్రంలోని రైతన్నలు, నేతన్నలు, ఆటో డ్రైవర్లు, గురుకుల పాఠశాలల సమస్యల నుంచి మొదలుకొని అన్ని వర్గాల సమస్యలపై, అలాగే ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై చర్చ పెట్టాలి. ప్రజా సమస్యలపై చర్చించిన తర్వాత, రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్న స్కాములపై, ఫార్ములా-ఈ వంటి అంశాలపై కూడా చర్చకు మేము సిద్ధమే. క్యాబినెట్ మీటింగ్ పేరుతో గంటల తరబడి ఎవరిని అరెస్ట్ చేయాలో చర్చించడం కాదు. పాలన అంటే ప్రజల కోసం చర్చించడమే అని కేటీఆర్ చెప్పారు’’ అని కేటీఆర్ అన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram