ABP News

ఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

Continues below advertisement

ఫార్ములా-ఈ రేస్‌లో అక్రమాలు జరిగాయంటూ తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌పై ACB కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. కేటీఆర్ కూడా ఈ కేసుపై స్పందించారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్స్‌నీ బయటపెట్టి అసలేం జరిగిందో వివరించారు. అయితే..ప్రభుత్వం మాత్రం ఇందులో కచ్చితంగా అవినీతి జరిగిందని తేల్చి చెబుతోంది. అంతా ఆలోచించే ACB వరకూ కేసుని తీసుకెళ్లామని అంటోంది. ఈ క్రమంలోనే కేటీఆర్ న్యాయపోరాటానికి దిగారు. త్వరలోనే ఆయనను ఈ కేసులో అరెస్ట్ చేయనున్న నేపథ్యంలో అరెస్ట్‌పై స్టే ఇవ్వాలని కోరుతూ ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. అంతే కాదు. ఏసీబీ కేసుని కొట్టివేయాలనీ పిటిషన్ వేశారు. ఈ కేసులో తనని అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని ఈ పిటిషన్‌లో కోరారు. అయితే...కేటీఆర్ అరెస్ట్ అయితే రాష్ట్రవ్యాప్తంగా గొడవ చేయడానికి బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని...ఇందుకోసం కోటి రూపాయలు కేటాయించింందని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలూ సంచలనమవుతున్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram