దవాఖానకు పోవాలి, చేయి నొప్పి పుడుతోంది - పోలీసులతో హరీశ్ వాగ్వాదం

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన ఇంట్లో నుంచి బయటకు రాకుండా హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే హరీశ్ రావు, పోలీస్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. చేయి నొప్పిగా ఉందని..హాస్పిటల్‌కి వెళ్లాలని హరీశ్ రావు చెప్పినా పోలీసులు బయటకు వెళ్లేందుకు అనుమతినివ్వలేదు. ఫలితంగా కాసేపు పోలీసులతో హరీశ్ రావు వాదించారు. ఇక చేతికి గాయమై బాధపడుతున్న హరీశ్ రావుని పరామర్శించేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డితో పాటు మాజీ ఎంపీ మాలోతు కవిత ఆయన ఇంటికి వచ్చారు. లోపలికి వెళ్లకుండా పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. బలవంతంగా ఇద్దరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అయితే..ఈ వరుస  ఘటనలతో హరీశ్ రావు ఇంటి వద్ద చాలా సేపటి వరకూ ఉద్రిక్తత కొనసాగింది. పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా..హరీశ్ రావు హాస్పిటల్‌కి వెళ్లాలని పట్టుబట్టారు. అందుకు అనుమతి ఇవ్వలేమని పోలీసులు తేల్చి చెప్పారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola